యశ్‌ 'టాక్సిక్‌' నిర్మాణ సంస్థకు కోర్టు నోటీసులు | Court Notice Issue To Yash Toxic Movie Makers | Sakshi
Sakshi News home page

యశ్‌ 'టాక్సిక్‌' నిర్మాణ సంస్థకు కోర్టు నోటీసులు

Published Sat, Jul 27 2024 6:20 PM | Last Updated on Sat, Jul 27 2024 7:31 PM

Court Notice Issue To Yash Toxic Movie Makers

కన్నడ హీరో యశ్‌ ‘టాక్సిక్‌’ సినిమా షూటింగ్‌ ప్రారంభంలోనే చిక్కుల్లో పడింది. కేజీఎఫ్‌ సినిమాల తర్వాత యశ్‌ నటిస్తున్న భారీ ప్రాజెక్ట​్‌ కావడంతో ఆయన అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. మలయాళ నటి–దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ, శ్రుతీహాసన్‌ వంటి స్టార్స్‌ పేర్లు వినిపించాయి. అలాగే యశ్‌కు సోదరి పాత్రలో కరీనా కపూర్‌ నటిస్తారనే ప్రచారం జరిగింది.

టాక్సిక్‌ చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. టాక్సిక్‌ సినిమా సెట్‌ను అటవీ భూమిలో పెద్దఎత్తున ఏర్పాటు చేశారని న్యాయవాది జి. బాలాజీ పిల్‌ దాఖలు చేశారు. వెంటనే సెట్‌ను క్లియర్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ పిల్‌కు సంబంధించి కెవిఎన్‌  ప్రొడక్షన్స్‌ సంస్థతో పాటు, హెచ్‌ఎంటిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

న్యాయవాది జి. బాలాజీ  చెబుతున్న ప్రకారం అటవి ప్రాంతానికి సమీపంలోని 20 ఎకరాల స్థలం (అటవీ భూమి)లో అనధికారికంగా టాక్సిక్‌ సెట్‌ను నిర్మించారని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ఈ సెట్‌ను వెంటనే క్లియర్ చేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే, ఈ అంశంలో విచారణను ఆగష్టు 19కి కోర్టు వాయిదా వేసింది.

నోటీసుల అంశంపై టాక్సిక్‌ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రీత్‌ రియాక్ట్‌ అయ్యారు. సెట్ వేస్తున్న స్థలం తమ ఆత్మీయులదేనని ఆయన చెప్పారు. దీంతో కోర్టు నోటీసులు ఆఫీసుకి లేదా స్థలం యజమానికి వచ్చి ఉండవచ్చని ఆయన అన్నారు.  కెవిఎన్ సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ నుంచి టాక్సిక్‌ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement