
బిగ్‌బాస్ కంటెస్టెంట్లు షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయన బ్రేకప్ చెప్పుకోబోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే నిజమని తేల్చేసింది దీప్తి. తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కొత్త సంవత్సరానికి లవ్ బ్రేకప్‌తో స్వాగతం పలికింది. షణ్నుతో తన తెగదెంపుల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.
'ఎంతో ఆలోచించి, ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం.. షణ్ముఖ్, నేను పరస్పర అంగీకారంతో విడిపోయి ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. గత ఐదేళ్లలో మేము సంతోషంగా ఉన్నాం, అదే సమయంలో మాలోని రాక్షసులతో పోరాడాం. ఫైనల్‌గా మీరు కోరుకున్నట్లే ఈ నిర్ణయం తీసుకున్నాం.. ఇది చాలాకాలంగా కొనసాగుతోంది. ఈ బ్రేకప్ సోషల్ మీడియాలో కనిపించినంత ఈజీ అయితే కాదు. ఇద్దరం కలిసి ఉండటానికి ప్రయత్నించాం, కానీ జీవితానికి ఏవి అవసరమో వాటిని విస్మరించాం. మా ఇద్దరి దారులు వేరని తెలుసుకున్నాం. అందుకే ఇక్కడే ఆగిపోకుండా ముందుకు సాగాలని భావించాం. ఇది మాకెంతో క్లిష్ట సమయం. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు మా ప్రైవసీకి భంగం కలిగించరని కోరుతున్నాను' అని రాసుకొచ్చింది. కొత్త సంవత్సరంలో ఇద్దరూ కలిసిపోతారనుకుంటే ఇలా విడిపోయారేంటని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
కాగా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొన్న షణ్ముఖ్.. సిరితో ఎక్కువ కనెక్ట్ అయ్యాడు. ఫ్రెండ్ అంటూనే హగ్గులు, ముద్దుల దాకా వెళ్లాడు. హగ్గులు నచ్చడం లేదని సిరి తల్లి చెప్పినప్పటికీ వీళ్లిద్దరూ పద్ధతి మార్చుకోలేదు. ఈ వైఖరి దీప్తి సునయనకు కూడా నచ్చలేదట! అందుకే బిగ్‌బాస్ షోకు వచ్చినప్పుడు కనీసం సిరిని పలకరించనేలేదు. అయితే ఎన్ని గొడవలు పడ్డా కలిసిపోతామని చెప్తూ వచ్చిన షణ్ను ఈ బ్రేకప్‌పై ఎలా స్పందిస్తాడో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment