టైటిల్: డిటెక్టివ్ కార్తీక్
నటీనటులు: రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శృతి మోల్, అనూష నూతల, మ్యాడీ, అభిలాష్ బండారీ, యెషో భరత్ రెడ్డి తదితరులు
నిర్మాత: అశోక్ రెడ్డి
దర్శకత్వం: వెంకట్ నరేంద్ర
సంగీతం: మార్కస్ ఎం
విడుదల తేది: జులై 21, 2023
మిస్టర్ అండ్ మిస్, ఓ స్త్రీ రేపు రా, మహానటులు వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ రెడ్డి తాటిపర్తి రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్ పై నిర్మాతగా చేస్తున్న కొత్త సినిమా డిటెక్టివ్ కార్తీక్. ఈ చిత్రానికి వెంకట్ నరేంద్ర దర్శకత్వం వహించారు. రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శ్రుతి మోల్, అనుష నూతల, మ్యాడీ, అభిలాష్ బండారి మరియు యేషో భరత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
‘డిటెక్టివ్ కార్తీక్’ కథేంటంటే..
పదో తరగతి చదువుతున్న రిషిత అనే అమ్మాయి హత్యకు గురవుతుంది. ఈ కేసును ఓ ప్రైవేట్ డిటెక్టివ్ సంధ్య(శ్రుతీ చంద్రన్) టేకాప్ చేస్తుంది.స్నేహితురాలు పల్లవి(గోల్డి నిస్సి)తో కలిసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తుంది. ఓ రోజు సంధ్య కిడ్నాప్‌కు గురవుతుంది. సంధ్యను ప్రేమిస్తున్న మరో ప్రైవేట్ డిటెక్టివ్ కార్తీక్(రజత్ రాఘవ్)సంధ్య మిస్సింగ్ కేసుతో పాటు రిషిత మర్డర్ కేసును కూడా ఛేదించాలని చూస్తాడు. అసలు సంధ్యను కిడ్నాప్ చేసిందెవరు? రిషితను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? ఈ కేసులను విచారించే క్రమంలో కార్తీక్‌కు ఎదురైన సవాళ్లు ఏంటి? వీటన్నింటిని అధిగమించి సంధ్య మిస్సింగ్ కేసుతో పాటు రిషిత హత్య కేసును ఎలా ఛేదించాడు అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ఇంట్రెస్టింగానే ఉంటాయి.గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను వెండితెరపై ఆవిష్కరిస్తే చాలు ప్రేక్షకులకు కుర్చీలో నుంచి కదల కుండా కట్టి పడేయొచ్చు. ఓటీటీలో కూడా ఈ తరహా చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. నేరం జరిగిన తీరు.. ధాన్ని చేధించే విధానం.. ఈ క్రమంలో ఎదురయ్యే ట్విస్టులు..మలుపులు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. ఇక డిటెక్టివ్ కార్తీక్ కూడా ఆ కోవకు చెందిన సినిమానే. నేటి టెక్నాలజీ యుగంలో యువత బాగా ఫేస్ చేస్తున్న ఓ సైబర్ క్రైం ను బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు వెంకట్ నరేంద్ర.ఓ మంచి సందేశాన్ని కూడా ఈ చిత్రం ద్వారా ఇచ్చారు.
టెక్నాలజీ వల్ల కలిగే అనర్థాలను... దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనే దాన్ని చూపించారు. అయితే ఇన్వెస్గిగేషన్ తీరు మాత్రం చప్పగా, సినిమాటిక్‌గా అనిపిస్తుంది. రిషిత హత్యతొ కథ ప్రారంభం అవుతుంది. ఈ కేసును ప్రైవేట్ డిటెక్టివ్ సంధ్య టేకాప్ చేసుకోవడం.. ఆమె మిస్ అవ్వడం చకచక జరిగిపోతుంది. ఈ కేసును కార్తీక్ టేకాప్ చేసినప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది.
ఇక ఫస్టాఫ్ మొత్తం రిషిత హత్య కేసు విచారణకే పరిమితం అవుతుంది. ఆమెను హత్య చేయడానికి గల కారణం ఊహించని విధంగా ఉంటుంది. ఇక సెకండాఫ్ మొత్తం సంధ్య మిస్సింగ్ కేసు చుట్టు తిరుగుతుంది. డబ్బు మీద వ్యామోహంతో కొంతమంది ఎలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారనేది చూపించారు. అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నా.. ఓ మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో ఒకరిద్దరు మినహా అందరూ కొత్తవాళ్లే. అయినా కూడా ఆ విషయం ఎక్కడా కనిపించకుండా చక్కగా నటించారు. టైటిల్ రోల్ పోషించిన రజత్ రాఘవ్... డిటెక్టివ్ పాత్రకు న్యాయం చేశాడు. సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక పల్లవిగా గోల్డీ నిస్సీ, సంధ్యగా శృతిమోల్ తమ పాత్రల పరిధిమేర చక్కగా చటించారు. కార్తీక్ ఫ్రెండ్‌గా హరి, కంప్యూటర్ టీచర్ రాహుల్ పాత్రలో అభిలాష్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సంగీతం, సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment