
Dhanush- Sekhar Kammula Movie: యూత్‌ఫుల్, ఫ్యామిలీ, లవ్, పాలిటిక్స్.. ఇలా కాన్సెప్ట్ ఏదైనా ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కిస్తారు దర్శకుడు శేఖర్ కమ్ముల. కథాంశం ఎలాంటిదైనా అందులోని పాత్రకు తగ్గట్టు మారిపోతారు ధనుష్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా మూవీ అనగానే సబ్జెక్ట్ ఏదై ఉంటుందా? అనే చర్చ ఇటు టాలీవుడ్‌లోనే కాదు.. అటు కోలీవుడ్‌లోనూ జరుగుతోంది.
మద్రాస్ రాజధానిగా తెలుగు, తమిళ ప్రజలు కలిసి ఉన్ననాటి కథతో ఈ సినిమా ఉంటుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. తాజాగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో ఆరంభం కానుంది. నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment