సంక్రాంతి సినిమాల విడుదలపై ఇప్పటికి కూడా కొనసాగుతున్న కొన్ని అంశాల గురించి అదేవిధంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, గిల్డ్ నుంచి కొంతమంది ప్రొడ్యూసర్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇండస్ట్రీ గురించి చర్చించిన విషయాలు గురించి తాజాగా మాట్లాడటం జరిగింది. ఈ సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు , తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, వై వి ఎస్ చౌదరి, సునీల్ నారంగ్ , పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు మాట్లాడుతూ : సంక్రాంతి సినిమాల బరిలో నుంచి ఫిలిం ఛాంబర్ కోరగానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి టీ. జీ. విశ్వప్రసాద్, వివేక్‌తో పాటు హీరో రవితేజ గారు ముందుకొచ్చి తమ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిబ్రవరి 9కి మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు అదే ఫిబ్రవరి 9కి భైరవకోన తమ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ముందు ఈ విషయం ఛాంబర్ నోటీస్‌కు రాలేదు వచ్చిన వెంటనే ఆ చిత్రం నిర్మాత అనిల్ సుంకరతో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఛాంబర్ వినతిని మన్నించి తమ చిత్రాన్ని ఒక వారం రోజులు అంటే ఫిబ్రవరి 16కు మార్చుకోవడం జరిగింది.
సంక్రాంతి అప్పుడు చాంబర్ వినతిని మన్నించి తమ డేట్‌ని మార్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి ఇప్పుడు కూడా తమ డేట్ ని మార్చుకొని ఛాంబర్ వినితిని మన్నిస్తున్న ఏ కె ఎంటర్టైన్మెంట్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఫిబ్రవరి 9కి రిలీజ్ అవుతున్న ఈగల్ చిత్రానికి ఎక్కువ శాతం థియేటర్స్ వచ్చేలాగా చూడడం జరుగుతుంది. అదే తేదీలో యాత్ర 2 వాళ్లు కూడా రిలీజ్ పెట్టుకున్నారు. ఆ చిత్రం విడుదల తేదీని చాలా రోజుల క్రిమతమే ఫిక్స్ చేసుకోవడం వల్ల వాళ్లు డేట్ చేంజ్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అదేవిధంగా ఒక తమిళ్ సినిమా రజనీకాంత్ లాల్ సలాం కూడా ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది.
ఇదే విషయాన్ని ఈగల్ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లతో చర్చించినప్పుడు పర్లేదండి మా సినిమాతో రెండు సినిమాలు రావడం పెద్ద ఇబ్బంది కాదు అని చెప్పి వాళ్లు అనడం చాలా ఆనందం అనిపించింది. ఫిబ్రవరి 9కి ఈగల్ మేజర్ థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది.' అని దిల్ రాజు అన్నారు.
ఇండస్ట్రీ, మీడియా కలిసి ఒకటిగా పని చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగిందని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ తెలిపారు. ఇండస్ట్రీ, మీడియా ఒకటిగానే ఉంది. భవిష్యత్తులో కూడా ఒకటిగానే ఉంటుంది. పరిశ్రమ గురించి ఏమైనా మీడియాకి సందేహాలు ఉంటే ఫిలిం ఛాంబర్లో తామందరం అందుబాటులో ఉంటాం. ఇక్కడకు వచ్చి అసలు నిజాన్ని తెలుసుకుని ప్రజలకి పబ్లిష్ చేయవలసిందిగా కోరుతున్నట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment