టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కల్పించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా ఆయన్ని నియమిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
టాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమై చిత్రాలను నిర్మిస్తూ అగ్ర నిర్మాతగా దిల్ రాజుకు మంచి గుర్తింపు ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు నిర్మిస్తూ కొత్త వారికి కూడా అనేకమందికి ఛాన్సులు కల్పిస్తారనే విషయం తెలిసిందే. ఇండిస్ట్రీలోకి కొత్తగా వస్తున్న వారిని ప్రొత్సహిస్తూ ఆయన పలు కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభంచారు. న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు తాను 'దిల్ రాజు డ్రీమ్స్' పేరుతో కొత్త బ్యానర్ క్రియేట్ చేస్తున్నామని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. దీని కోసం ఆయన ఒక వెబ్‌సైట్‌ను కూడా త్వరలో లాంచ్ చేయనున్నారు. ముఖ్యంగా ఈ బ్యానర్ కొత్త వారికి ఎక్కువగా ఉపయోగపడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
TFCC అధ్యక్షుడిగా దిల్ రాజు
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) అధ్యక్షుడిగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో దిల్ రాజు విజయం సాధించారు. ఆ ఎన్నికల ద్వార 2023-25 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. భవిష్యత్ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందించాలనే నినాదంతో దిల్‌రాజు ప్యానెల్ ఆ సమయంలో బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment