
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మించారు. తెలుగులో ‘బీస్ట్’ పేరుతోనే శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌పై ‘దిల్’రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిల్‌రాజు పూజా హెగ్డేపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. పూజా హెగ్డే లక్కీ గర్ల్‌గా మారిందని, టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించి బ్లాక్ బస్టర్ హిట్స్‌ని సొంతం చేసుకుందని పేర్కొన్నారు.
ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీలో కూడా ముందు పూజానే హీరోయిన్‌గా అనుకున్నామని దానికి సంబంధించి చర్చలు కూడా జరిగాయని అన్నారు. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం సహా విజయ్- పూజా కాంబినేషన్ వెంటవెంటనే రిపీట్ అవుతుందని తీసుకోలేదని చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఛాన్స్ రష్మిక మందన్నా కొట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment