Director Rajesh Dondapati Talk About Krishna Gadu Ante Oka Range - Sakshi

‘కృష్ణగాడు..’ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌: రాజేష్‌ దొండపాటి

Published Tue, Aug 1 2023 4:34 PM | Last Updated on Tue, Aug 1 2023 5:07 PM

Director Rajesh Dondapati Talk About Krishna Gadu Ante Oka Range - Sakshi

‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌’ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌’ అని దర్శకుడు రాజేష్‌ దొండపాటి అన్నారు. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌’. పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పీఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్‌ మూర్తి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా రాజేష్‌ దొండపాటి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నాకిది తొలి సినిమా. మేకింగ్‌లో చిన్నా చిత‌క ఇబ్బందులు త‌ప్ప ఏమీ ఎదురు కాలేదు. ప్రొడ్యూస‌ర్ ర‌ఘురామ్‌గారి స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న దాని కంటే రెండు రోజుల ముందే పూర్తి చేశాం. చాలా మంచి టీమ్ కుదిరింది. ముఖ్యంగా సాబు వ‌ర్గీస్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజ‌ర్ ఎసెట్‌గా నిలిచింది. దానికి త‌గ్గ‌ట్లు వ‌రికుప్ప‌ల యాద‌గిరిగారు అద్భుత‌మైన లిరిక్స్ అందించారు. మూవీలోని పాట‌లు విన్న‌వాళ్లంద‌రూ బావున్నాయని అప్రిషియేట్ చేస్తున్నారు. మా చిత్రం కచ్చితంగా అందరికి నచ్చుతుంది’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement