RC15: శంకర్‌ భారీ స్కెచ్‌.. ఒక్క పాటకే అన్ని కోట్లా? | Director Shankar Plans A BIg Song For Ram Charan RC15 | Sakshi
Sakshi News home page

RC15: RC15: శంకర్‌ భారీ స్కెచ్‌.. ఒక్క పాటకే అన్ని కోట్లా?

Published Tue, Oct 25 2022 10:53 AM | Last Updated on Tue, Oct 25 2022 11:02 AM

Director Shankar Plans A BIg Song For Ram Charan RC15 - Sakshi

డైరెక్టర్‌ శంకర్‌-మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈచిత్రానికి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరపుకుంటోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక శంకర్‌-రామ్‌ చరణ్‌ కాంబో అనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే మూవీ నిర్మాణంలో కూడా శంకర్‌ ఎక్కడ రాజీ పడడనే విషయం తెలిసిందే. ముఖ్యం పాటలను ఆయన చాలా రిచ్‌గా ప్లాన్‌ చేస్తాడు. అలాగే ఈ సినిమాలోనూ చరణ్‌-కియారాల మధ్య ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను భారీగా ప్లాన్‌ చేశాడట శంకర్‌.

చదవండి: నన్ను అల అనడంతో మేకప్‌ రూంకి వెళ్లి ఏడ్చా: నటి ప్రగతి

ఈ పాట కోసం ఏకంగా ఆయన రూ. 23 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు ఫిలిం ధునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈపాటలో రామ్‌ చరణ్‌-కియారాలతో కలిసి 1000మందికి పైగా డ్యాన్సర్స్‌ స్టెప్పులు వేయనున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతున్నది క్లారిటీ. దీనిపై స్పష్టత రావాలంటే మూవీ టీం స్పందించే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్‌ మొదలైప్పటి నుంచి ఆర్‌సీ 15 సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆయన ఒక్క ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కే దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టాడని, అలాగే ఈ సన్నివేశం కోసం రూ. 10 కోట్లతో ఓ సెట్‌ వేసినట్లు గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. 

చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి మహేశ్‌? ఈసారి భార్య పేరు మీదుగా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement