హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నమని తెలిపారు.
‘నేను, నా కుటుంబసభ్యులు కొద్ది రోజులుగా తేలికపాటి జ్వరంతో బాధపడ్డాం. అయితే ఆ తర్వాత జ్వరం తగ్గిపోయింది. కానీ మేము కరోనా టెస్ట్ చేయించుకున్నాం. అయితే మాకు ఈ రోజు కొద్దిపాటి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. వైద్యుల సూచన మేరకు మేము హోం క్వారంటైన్‌లో ఉంటున్నాం. ఇప్పుడు మేము బాగానే ఉన్నాం. మాకు ఎటువంటి లక్షణాలు లేవు.. కానీ మేము అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిబంధనలు పాటిస్తున్నాం. శరీరంలో యాంటీ బాడీలు ఏర్పడాలని చూస్తున్నాం.. ఆ తర్వాత ప్లాస్మా దానం చేయాలని అనుకుంటున్నాం’ అని రాజమౌళి తెలిపారు. [ చదవండి: సోనూసూద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా? ]
All of us are feeling better with no symptoms but are following all precautions and instructions...
— rajamouli ss (@ssrajamouli) July 29, 2020
Just waiting to develop antibodies so that we can donate our plasma... 🙂🙂💪🏼💪🏼
Comments
Please login to add a commentAdd a comment