
గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగాప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వెడ్డింగ్ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘డుం డుం డుం డుం డుం మోగింది మేళం’ ....అంటూ మొదలయ్యే ఈ పాటకి సాహిత్యాన్ని కె కె అందించగా, మహతి స్వర సాగర్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చాడు.
దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ..‘చిత్ర కథాంశం ప్రకారం నాయక, నాయికల పెళ్లి గీతం ఇది. వీరి నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకూ జరిగే వివిధ వ్యవహారాలు,సందర్భాలు, సన్నివేశాల సమాహారం ఈ పాట. పట్టణం నేపథ్యంలో చిత్రీకరించిన దీనిని రచయిత కె కె ఎంతో చక్కగా రచించారు. ప్రేక్షకుడు కూడా సహజంగా అనుభూతి చెందేలా చిత్రీకరించడం జరిగింది’ అన్నారు. దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు "స్వాతిముత్యం" ను అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment