
బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘స్వాతిముత్యం’. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్. లక్ష్మణ్ కె. కృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో లక్ష్మణ్ చెప్పిన విశేషాలు.
► సినిమాలంటే ఆసక్తితో ఇంజనీరింగ్ పూర్తి కాకుండానే ఇండస్ట్రీకి వచ్చేశాను. ‘లాస్ట్ విష్’, ‘కృష్ణమూర్తిగారింట్లో..’ అనే షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ‘కృష్ణమూర్తిగారింట్లో..’కి మంచి
ఆదరణ లభించింది. దీంతో ఓ సినిమా అవకాశం వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ నెక్ట్స్ నేను ‘సదా నీ ప్రేమలో..’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను. ఆ తర్వాత ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ చేయాలనుకుని ‘స్వాతిముత్యం’ కథ రాశాను.
► ‘స్వాతిముత్యం’లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన బాలమురళీ కృష్ణగా బెల్లంకొండ గణేష్ నటించారు. బాలమురళీ కృష్ణ ప్రభుత్వోద్యోగం సంపాదిస్తాడు. ఆ తర్వాత కుటుంబసభ్యులు అతనికి పెళ్లి చేయాలనుకుంటారు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అన్నదే కథ. మా చుట్టుపక్కల గ్రామాల్లోని ఘటనలను కూడా పొందుపరిచాను.
► ఈ సినిమాకు ‘స్వాతిముత్యం’ టైటిల్‌ను నిర్మాత చినబాబుగారు సూచించారు. ఎక్కువగా అమాయక పాత్రలు ఉన్నాయి కాబట్టి ఈ టైటిల్ అయితే బాగుంటుందని భావించారాయన.
► చిరంజీవిగారికి నేను వీరాభిమానిని. ఆయన ‘గాడ్ ఫాదర్’ విడుదలవుతున్న రోజునే నా దర్శకత్వంలోని సినిమా రిలీజ్ అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. చిరంజీవి, నాగార్జున గార్లు వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న సమయంలో మా సినిమాను రిలీజ్ చేయడం అనేది నిర్మాతల నిర్ణయం. కానీ నాకు కాస్త భయంగానే ఉంది. మా సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సో.. ఫెస్టివల్‌కు రిలీజ్ అయితే బాగుంటుందని మేం భావించాం.
Comments
Please login to add a commentAdd a comment