ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని నెలన్నర గడిచిన ఇప్పటికీ దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ పట్నా పోలీసు స్టేషన్‌లో నటి రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి 15 కోట్ల రూపాయలు రియా కాజేసిందంటూ సుశాంత్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆయన ఫిర్యాదు మేరకు విచారణ మొదలు పెట్టారు. (చదవండి: సుశాంత్ కేసు: పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు)
గురువారం ఈడీ అధికారులు సుశాంత్ ఎఫ్‌ఐఆర్‌పై వివరణ కోరినట్లు సమాచారం. సుశాంత్ బ్యాంక్ ఖాతాలను పరిశీలించేందుకు బిహార్ పోలీసుల నుంచి ఎఫ్‌ఐఆర్ ఫైల్‌ను స్వాధీనం చేసుకుని ముంబై బాంద్రాలోని కోటక్ మహింద్రా బ్యాంక్‌కు ఈడీ అధికారులు చేరుకున్నట్లు సమాచారం.
సుశాంత్ ఖాతాతో 17 కోట్ల రూపాయలు ఉన్నాయని, అందులో 15 కోట్ల రూపాయలు మూడు వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు డబ్బు బదిలి అయ్యిందని కేకే సింగ్ ఆరోపించారు. ఆ ఖాతాలు రియా, ఆమె సోదరుడు, తల్లికి సంబంధించినవేనని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుశాంత్‌ను రియా వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించిందంటూ కేకే సింగ్ జూలై 28న పట్నా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. (చదవండి: సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు)
Comments
Please login to add a commentAdd a comment