మరో తెలుగు మూవీ పెద్దగా హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఇది సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తీసిన సినిమా కావడంతో సినీ ప్రేమికులు దీనిపై ఓ లుక్కేయాలని అనుకుంటున్నారు. ఇదే నెలల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. నెల తిరగకుండానే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎక్కడ అందుబాటులో ఉంది?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?)
గీతానంద్, నేహా సోలంకి హీరోహీరోయిన్లు నటించిన 'గేమ్ ఆన్' చిత్రం.. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చింది. అప్పట్లో బ్లూ వేల్ అని ఓ గేమ్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కాస్త అటుఇటుగా దీన్ని పోలిన కథతోనే ఈ సినిమా తీశారు. స్టోరీ లైన్ పరంగా చూస్తే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పటికీ ప్రముఖ నటీనటులు లేకపోవడంతో అలా థియేటర్లలోకి వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఇప్పుడేమో అమెజాన్ ప్రైమ్‌లోకి సడన్‌గా వచ్చేసింది.
'గేమ్ ఆన్' కథ విషయానికొస్తే.. గౌతమ్ (గీతానంద్) ఓ గేమింగ్ కంపెనీలో పనిచేస్తూ మోక్ష (వాసంతి)తో ప్రేమలో ఉంటాడు. టార్గెట్ పూర్తి చేయకపోవడంతో ఇతడిని పని నుంచి తీసేస్తారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. సరిగ్గా ఈ టైంలో ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. చిన్న చిన్న టాస్కులు ఇస్తూ వాటిని పూర్తి చేస్తుంటే.. గౌతమ్ అకౌంట్‌లో సదరు అజ్ఞాత వ్యక్తి డబ్బులేస్తుంటారు. ఓసారి ఓ వ్యక్తిని చంపాలని టాస్క్ ఇస్తాడు. మరి చివరకు ఏమైంది? అనేదే 'గేమ్ ఆన్' స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఊరు పేరు భైరవకోన'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)
Comments
Please login to add a commentAdd a comment