సీరియల్స్‌లో జగతినే.. అక్కడ మాత్రం తన ఫోటోలు వైరల్‌ | Guppedantha Manasu Jyothi Rai Latest Photos Goes Viral - Sakshi
Sakshi News home page

ఇంత గ్లామర్‌ పెట్టుకుని మదర్‌ రోల్స్‌ ఎందుకు.. సీరియల్‌ నటిపై కామెంట్లు

Published Fri, Sep 8 2023 10:10 AM | Last Updated on Fri, Sep 8 2023 11:52 AM

Guppedantha Manasu Jyothi Rai Photos Viral - Sakshi

గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా నటి జ్యోతి రాయ్ (38) తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటి దాదాపు 20కి పైగా సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా చాలా సినిమాల్లోనూ కనిపించింది. శాండల్‌వుడ్‌లో ఫుల్‌ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో జ్యోతిరాయ్ ఒకరు. గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి గుండెల్ని పిండేసే నటనతో ఫిదా చేస్తుంది.

(ఇదీ చదవండి: 'హీరోయిన్‌తో అలాంటి సీన్‌.. ఒక గొడవతో ఆగిపోయింది')

కన్నడలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జ్యోతి రాయ్ అసలు పేరు జయశ్రీ రాయ్. గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. రిషికి తల్లిగా.. మహేంద్ర భూషణ్‌కు భార్యగా విలక్షణమైన నటనతో అబ్బుర పరుస్తున్న ఈ సీనియర్ బ్యూటీ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అయితే సీరియల్‌లో జగతి పాత్రకి తగ్గట్టుగా కట్టు బొట్టుతో అలరించే జ్యోతిరాయ్ తన ఇన్ స్ట్రాగ్రామ్‌లో మాత్రం ఫుల్ స్టైలిష్ ఫోటోలతో రచ్చ చేస్తుంటారు. నిత్యం సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ అభిమానులను పిచ్చెక్కిస్తుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

(ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: మాజీ ప్రియుడిని ఏళ్లుగా మిస్‌ అవుతున్నా.. ఏడ్చేసిన రతిక)

తాజాగా ఆమె ఒక హాట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  ఆ ఫొటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ ఇంత గ్లామర్ పెట్టుకుని మదర్ రోల్స్ చేస్తున్నారేంటి మేడమ్ అంటూ.. మీరు హీరోయిన్ మెటీరియల్ అని కామెంట్ల మోత మోగిస్తున్నారు.  ప్రస్తుతం సీరియల్స్‌తో పాటు ప్రెట్టీ గర్ల్ అనే క్రైమ్ థిల్లర్ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో ఫీమేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఇటీవలే  శాండల్‌వుడ్‌ భామ యువ దర్శకుడు అయిన సుకు పూర్వాజ్‌తో రిలేషన్‌లో ఉందంటూ ఇటీవలే ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె ట్విటర్‌ హ్యాండిల్‌లోనూ కూడా జ్యోతి పుర్వాజ్ అనే పేరు పెట్టుకోవడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో వైరలైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement