ఒకే ఒక్క పాత్రతో రూపొందుతోన్న చిత్రం ‘105 మినిట్స్’. కథానాయిక హన్సిక లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రా¯Œ ‡్ష సెల్యూలాయిడ్ పతాకంపై బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు. రాజు దుస్సా మాట్లాడుతూ –‘‘ఒకే ఒక్క పాత్రతో ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. ‘సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్, రీల్ టైమ్ – రియల్ టైమ్’ ఈ చిత్రంలో హైలైట్స్‌గా నిలుస్తాయి.
ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో హన్సిక కనిపిస్తారు’’ అన్నారు. ‘‘105 మినిట్స్’ చిత్రం నా కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలుస్తుంది’’ అన్నారు హన్సిక. ‘‘నిర్మాణ విలువలు తగ్గకుండా అన్ని వాణిజ్య హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అని బొమ్మక్ శివ అన్నారు. ‘‘ఈ సినిమా మేకింగ్ నాకో ఛాలెంజ్. ఇలాంటి చిత్రాన్ని నా బ్యానర్‌లో నిర్మించడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు సినిమాటోగ్రాఫర్ దుర్గా కిశోర్.
Comments
Please login to add a commentAdd a comment