Hero Siddharth Back to Hyderabad From London After Spine Surgery - Sakshi
Sakshi News home page

Hero Siddharth: ఇండియాకు తిరిగి వచ్చాను, కోలుకుంటున్నా: సిద్ధార్థ్‌

Published Sat, Oct 2 2021 3:13 PM | Last Updated on Sun, Oct 3 2021 7:43 AM

Hero Siddharth Back to Home From London After Spine Surgery - Sakshi

హీరో సిద్ధార్థ్ ప్రస్తుతం కోలుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘మహా సముంద్రం’ మూవీ షూటింగ్‌ సమయంలో యాక్షన్‌ సీన్స్‌ చేస్తుండగా సిద్దార్థ్‌ గాయపడినట్లు ఇటీవల ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ దర్శకడు అజయ్‌ భూపతి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫైట్ సన్నివేశాల చిత్రీకరిస్తుండగా సిద్ధార్థ్‌ స్పైన్‌(వెన్నుముక)కు గాయమైంది. దీంతో సర్జరీ కోసం లండన్‌ వెళ్లిన సిద్దార్థ్‌ ఇటీవల తిరగి ఇండియా వచ్చాడట.  ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. తాను ఇండియాకు తిరిగి వచ్చినట్లు చెప్పాడు. అంతేగాక ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘మహా సముంద్రం’ సినిమాలో తన డబ్బింగ్‌ చెబుతున్నానని పేర్కొన్నాడు. 

చదవండి: లండన్‌లో హీరో సిద్ధార్థ్‌కు సర్జరీ!

ఈ సినిమా రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నన్నాడు. ఇక తన స్పైన్‌ సర్జరీ బాగా జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు చెప్పాడు. అయితే డాక్టర్లు మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు తెలిపాడు. అలాగే తనకు ట్రీట్‌మెంట్‌ చేసిన డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులకు ఈ సందర్భంగా సిద్దార్థ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా సిద్ధార్థ్‌ చాలా గ్యాప్‌ తర్వాత ‘మహా సముంద్రం’ మూవీతో తిరిగి టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్‌ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు.

 చదవండి: 'మా'ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌: మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement