ప్రముఖ హీరోయిన్ త్రిష కరోనా బారిన పడింది. పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు వైరస్ సోకిందన్న విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. 'అన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్నా నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పే కొన్ని క్షణాల ముందు ఈ మహమ్మారి సోకినట్లు నిర్ధారణ అయింది. మీకు తెలిసిన అన్ని లక్షణాలు నాకున్నాయి. నాకు ఆ వారం చాలా బాధ కలిగించింది. ప్రస్తుతానికి నేను కోలుకుంటున్నాను.'
'వ్యాక్సిన్ వేయించుకున్నాను కాబట్టే ఈరోజు బాగున్నాను. దయచేసి అందరూ వ్యాక్సిన్ తీసుకోండి, మాస్క్ ధరించండి. త్వరలోనే మళ్లీ కోవిడ్ టెస్ట్ చేయించుకుని ఇంటికి తిరిగొస్తా. నాకోసం ప్రార్థించిన బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని ట్విటర్‌లో రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేశ్‌బాబు, సత్యరాజ్, తమన్, మంచు మనోజ్, లక్ష్మి, చియాన్ విక్రమ్, అర్జున్, కమల్ హాసన్, వడివేలు సహా పలువురు తారలు వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే!
— Trish (@trishtrashers) January 7, 2022
Comments
Please login to add a commentAdd a comment