
సాక్షి, సిటీబ్యూరో: సంగీతం పట్ల తనకు సొంత బిడ్డల్ని తీర్చిదిద్దే క్రమంలో ఉండే శ్రద్ధతో సమానం అని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. మంగళవారం నగరంలోని టీ హబ్ ఫేజ్– 2లో తన అభిమానులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ.. ఓ తల్లి తన పిల్లలకు ఆహారం అందించే ముందు తాను రుచి చూసి ఎలా అందిస్తుందో.. అలాగే తన ఫ్యాన్స్‌కు సంగీతాన్ని ఇస్తానన్నారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సంగీతకారుడికి తెలియాల్సింది టెక్నాలజీ కాదని టెక్నిక్ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment