Interesting Buzz About SS Rajamouli, Mahesh Babu Upcoming Movie - Sakshi
Sakshi News home page

మహేశ్‌- రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌

Published Fri, May 19 2023 8:07 AM | Last Updated on Fri, May 19 2023 10:29 AM

Interesting Buzz About SS Rajamouli, Mahesh Babu Movie - Sakshi

హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఆరంభించే ఆలోచనలో ఉన్నట్లుగా ఈ చిత్ర కథారచయిత విజయేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

(చదవండి: పుష్ప 2పై అదిరిపోయే అప్‌డేట్‌.. ఆయన ప్రతీకారం మామూలుగా ఉండదట! )

ఇందుకు తగ్గట్లుగా ప్రీప్రొడక్షన్‌ వర్క్స్‌ను సెట్‌ చేస్తున్నారట రాజమౌళి అండ్‌ కో. ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకోన్, ఆలియా భట్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలే వెకేషన్‌కు వెళ్లిన మహేశ్‌ స్పెయిన్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నారు మహేశ్‌బాబు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ జూన్‌ మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement