కొత్తదనం ఉంటే ప్రేక్షకులు.. థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారని 'ఇంటి నెం.13' నిరూపిస్తోంది. మార్చి 1న విడుదలైన ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌పై చూసేవారి సంఖ్య పెరుగుతోంది. 72 థియేటర్లలో రిలీజ్ కాగా.. పాజిటివ్ టాక్ రావడంతోపాటు ఈ సంఖ్య 120 వరకు పెరిగింది. సినిమాలోని ట్విస్టులకు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి, డైరెక్టర్ టేకింగ్‌కి ఆడియన్స్ థ్రిల్ అవుతున్నారు.
(ఇదీ చదవండి: మళ్లీ థియేటర్లలోకి ఉదయ్ కిరణ్.. కల్ట్ సినిమా రీ రిలీజ్ ఎప్పుడంటే?)
ఎంతో సైలెంట్‌గా మొదలైన మా సినిమా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఏరియాలోనూ సెకండ్ షోలు హౌస్ ఫుల్ అవ్వడం చూస్తే సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అర్థమవుతుంది. థియేటర్లలో జనం లేకపోయినా సూపర్‌హిట్ అయిందని, కలెక్షన్స్ దుమ్ము రేపుతోందని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ‘ఇంటి నెం.13’ చిత్రానికి రాలేదు. ఈ చిత్రం తప్పకుండా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుంది అనిపిస్తోంది అని దర్శకుడు పన్నా రాయల్ ధీమాగా చెప్పాడు.
(ఇదీ చదవండి: Ooru Peru Bhairavakona OTT: సర్‌ప్రైజ్ ఓటీటీ ఎంట్రీకి 'ఊరి పేరు భైరవకోన' రెడీ!?)
Comments
Please login to add a commentAdd a comment