Actress Janhvi Kapoor Buys Luxury Duplex House In Bandra For Shocking Price, Deets Inside - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: పాతిల్లు అమ్మేసి కొత్తిల్లు కొన్న జాన్వీ కపూర్‌, ధరెంతంటే?

Published Fri, Nov 4 2022 6:16 PM | Last Updated on Fri, Nov 4 2022 7:37 PM

Janhvi Kapoor Buys Luxury Duplex In Bandra - Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి అందాన్నే కాదు నటననూ పుణికి పుచ్చుకుంది జాన్వీ కపూర్‌. కథ కోసం ఎంతటి రిస్క్‌ అయినా చేస్తూ తల్లికి తగ్గ కూతురిగా పేరు తెచ్చుకుంటోంది. 2018లో కెరీర్‌ మొదలు పెట్టిన జాన్వీ తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అందుకు తగ్గట్టుగానే చేతినిండా సంపాదిస్తోంది. ఆ మధ్య ఈ హీరోయిన్‌ జుహులోని తన ఇంటిని నటుడు రాజ్‌కుమార్‌ రావుకు రూ.45 కోట్లకు అమ్మేసిన విషయం తెలిసిందే కదా! తాజాగా ఆమె ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది.

ముంబైలోని బాంద్రాలో విలాసవంతమైన డూప్లెక్స్‌ బంగ్లాను తన సొంతం చేసుకుంది. జాన్వీ రిలాక్స్‌ అయ్యేందుకు వీలుగా ఫస్ట్‌ ఫ్లోర్‌లో స్విమ్మింగ్‌ పూల్‌, గార్డెన్‌ ఏరియా ఉందట. ఇక ఈ ఇంటి కోసం ఆమె ఏకంగా రూ.65 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. స్టాంప్‌ డ్యూటీ కింద మ రో రూ.3.90 కోట్లు చెల్లించారట. కాగా జాన్వీ కపూర్‌ నటించిన మిలి చిత్రం నేడు(నవంబర్‌ 4) రిలీజవగా దీనికి మిశ్రమ స్పందన లభిస్తోంది.

చదవండి: దేవిశ్రీప్రసాద్‌పై కేసు నమోదు
ద్వేషపూరిత సంస్కృతి పెరిగిపోయింది: శృతిహాసన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement