
తమిళ హీరో జయం రవి కొత్త సినిమా 'సైరన్'. మూవీ మేకర్స్ పతాకంపై సుజాత విజయకుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంతో ఆంటనీ భాగ్యరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇంతకు ముందు ఈ డైరెక్టర్.. అభిమన్యుడు, విశ్వాసం, హీరో చిత్రాలకు కథ సహకారం అందించాడు. ఇకపోతే జయం రవి పుట్టినరోజు కానుకగా ఆదివారం 'సైరన్' ప్రీ ఫేస్ వీడియోని రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)
ఈ సినిమాలో జయం రవి సరసన కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. యోగిబాబు, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సాల్ట్ పెప్పర్ లుక్‌తో ఓ బల్లపై కూర్చుని టీ తాగుతున్న జయం రవి ఫొటోను పోస్టర్‌గా కాకుండా చిన్న వీడియోగా విడుదల చేశారు.
భారీ బడ్జెట్‌తో తీస్తున్న 'సైరన్' సినిమాని యాక్షన్ కిల్లర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మిగతా వివరాలని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నాడు.
(ఇదీ చదవండి: 'పుష్ప 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. పెద్ద ప్లానింగే)
Comments
Please login to add a commentAdd a comment