డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి.. యూట్యూబ్‌లో మార్మోగుతున్న సాంగ్‌ | Jayathi Starrer Duggu Duggu Bulleto Song Trending on Youtube | Sakshi
Sakshi News home page

భోలె షావళి కొత్త పాట.. అదరగొట్టిన జయతి

Published Wed, Dec 11 2024 7:08 PM | Last Updated on Wed, Dec 11 2024 7:32 PM

Jayathi Starrer Duggu Duggu Bulleto Song Trending on Youtube

జయతి.. ఒకప్పుడు జెమినీ మ్యూజిక్‌లో వెన్నెల అనే షో ద్వారా వీడియో జాకీగా అలరించిన ఈమెకు అప్పట్లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. విపరీతమైన ఫాలోయింగ్ మాత్రమే కాదు, ఆంధ్ర మాధురి దీక్షిత్‌లా ఉందంటూ ఆమె అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తుండేవారు. వీడియో జాకీగా పనిచేసిన తర్వాత ఆ అమ్మడు సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అది కూడా నిర్మాతగా! తన సొంత నిర్మాణ సంస్థలో, లచ్చి అనే హారర్ కామెడీ జానర్ సినిమాను నిర్మిస్తూ అదే సినిమాలో హీరోయిన్‌గా కూడా నటించింది.

ఆల్బమ్ సాంగ్స్
అనంతరం కాస్త గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ చేస్తోంది. తాజాగా డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి అనే ఒక ఆల్బమ్ సాంగ్‌తో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు అందుకుంది. నివృతి వైబ్స్ యూట్యూబ్ ఛానల్‌లో రిలీజైన ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా రిలీజ్ అయిన ఈ పాట ఏకంగా 2 మిలియన్ల వ్యూస్ దక్కించుకోవడం గమనార్హం. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ ఫోక్ సాంగ్‌లో జయతి తనదైన శైలిలో ఆకట్టుకుంది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ భోలె షావళి సంగీతం అందించిన ఈ పాటకు వరం ఆలపించాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement