![Kajal Aggarwal First Post After Birth Of Son Neil Kitchlu Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/21/Kajal-Aggarwal.jpg.webp?itok=I2bFkk7u)
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. బిడ్డను హత్తుకున్న క్షణాన తాను పడ్డ 9 నెలల కష్టం మర్చిపోయినట్లు అనిపించిందని చెప్పుకొచ్చింది. ప్రసవ సమయంలో తాను అనుభవించిన కష్టాలను కూడా వివరించింది. ఈ మేరకు కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. 'బేబీ నీల్‌ను ఈ ప్రపంచంలోకి స్వాగతం పలికినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ లోకంలోకి అడుగుపెట్టిన కొద్ది క్షణాల్లోనే నా బిడ్డను తెల్లటి వస్త్రంలో చుట్టుకుని దగ్గరకు హత్తుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్‌ను మాటల్లో చెప్పలేను. ఆ క్షణాల్లో నేను ఎదుర్కొన్న అనుభూతి నాకు అద్భుతమైన తల్లి ప్రేమను అర్థమయ్యేలా చేసింది. బిడ్డ పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో గుర్తు చేసింది'
'కానీ ఇది అంత ఈజీగా జరగలేదు. మూడు నిద్రలేని రాత్రులు, రక్తస్రావం, సాగిన చర్మం, గడ్డకట్టిన ప్యాడ్‌లు, బ్రెస్ట్ పంప్స్, ఒత్తిడి, ఆందోళనతో సతమతమయ్యాను. కానీ ఎప్పుడైతే బుజ్జి పాపాయిని ఎత్తుకున్నానో చాలా సంతృప్తి కలిగింది. ఆత్మవిశ్వాసంతో ఒకరి కళ్లలోకి మరొకరం చూసుకుంటూ, ముద్దుల్లో ముంచెత్తుతూ, మేమిద్దరమే ఏకాంతంగా ఉంటూ, మరింత తెలుసుకుంటూ ఈ అద్భుతమైన ప్రయాణాన్ని కలిసి ప్రారంభించాం. ప్రసవానంతరం ఇదంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చేమోగానీ అందంగా మాత్రం ఉంటుంది' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు గర్భంతో ఉన్నప్పుడు దిగిన ఓ ఫొటోను దీనికి జత చేసింది.
Comments
Please login to add a commentAdd a comment