ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే చిత్రాలు చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హిందీ మూవీ ‘కాకుడా’ కూడా ఒకటి. ఈ సినిమా గురించి తెలుసుకుందాం.
మానవుని జీవితంలో అత్యంత సున్నితమైన మరియు భయోత్పాతమైన ఉదంతం ఏదైనా ఉంది అంటే అది మరణమే. ఆ మరణ ఇతివృత్తాంతాన్ని వినోదాత్మకంగా మలిచిన చిత్రమే ‘కాకుడా’. ఈ సినిమా జోనర్ హారర్ కామెడీ. దీనికి దర్శకులు ఆదిత్య సరపోతదార్. మామూలుగా హారర్ కామెడీ చిత్రాల్లో దెయ్యం మనుషులను భయపెట్టడం లేదా మనిషే దెయ్యాలను భయపెట్టడం చూశాం. వాటన్నిటికీ విరుద్ధంగా ‘కాకుడా’ సినిమా కాన్సెప్ట్ ఉండడం విశేషం. ఉత్తరాది రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామానికి సంబంధించిన కథ ఇది.
ఆ గ్రామం పేరే కాకుడా. ప్రతి మంగళవారం సరిగ్గా రాత్రి 7.15 నిమిషాలకు గ్రామంలోని ప్రతి ఇంటి చిన్న ద్వారం తలుపులు తీసి ఉంచాలి. ఇదే కథాంశం. ఎవరికైనా ఫలానా రోజున తాము మరణించే రోజు అని తెలిస్తే... ఇంకేముంది... క్షణక్షణం బాధతో నరకం అనుభవిస్తారు. కానీ ఈ సినిమాలో ప్రధాన పాత్రకి తాను మరణించే రోజు తెలిసినా పైకి కొంత బాధపడుతూనే అందరితో మామూలుగా ఉంటూ కథను నడిపిస్తాడు.
రితేష్ దేశ్‌ముఖ్, సోనాక్షీ సిన్హా వంటి పెద్ద తారలు నటించిన ఈ చిన్న సినిమా ఆద్యంతం కాలక్షేపదాయకం. కొన్ని కొన్ని సన్నివేశాల్లో దెయ్యం రూపం కాస్త పిల్లలను భయపెట్టినా సినిమా మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా సరదా సరదాగా చూడొచ్చు. ఈ వారానికి ‘కాకుడా’ సినిమా వినోదం కోసం గొప్ప ఛాయిస్ అని చె΄÷్పచ్చు. ఈ చిత్రం జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. – ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment