బెంగళూరు : ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకున్న కరోనా కారణంగా మరో సినీ నటుడు ప్రాణాలు కోల్పోయారు. కన్నడ ప్రముఖ నటుడు శని మహదేవప్ప(88) కరోనాతో జనవరి 3న కన్నుమూశారు. గత వారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మహదేవప్ప అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో చెన్నైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మహదేవప్ప మరణం కన్నడ చిత్ర పరిశ్రమను షాక్‌కు గరిచేసింది. కాగా మహదేవప్పకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అయితే ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి వయోభార సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఇటీవల బెంగుళూరులోని కేసీ జనరల్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆయనకు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. చదవండి: మాలీవుడ్‌లో మరో విషాదం
నటుడి మరణం పట్ల కన్నడ సినీ ఇండస్ట్రీ విచారం వ్యక్తం చేసింది. పునీత్ రాజ్‌కుమార్, కిచ్చ సుదీప్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో.. అప్పీ, భక్త కుంబర, శ్రీనివాస కళ్యాణ, కవిరత్న కాళిదాసలతో పాటు పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు శని మహాదేవప్ప కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా శని మహదేవప్ప 1962లో కన్నడ సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనంతరం లెజెండరీ నటుడు డా. రాజ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. అలాగే ఆయనతో కలిసి అనేక సినిమాల్లో నటించారు. శంకర్ గురు, ఒంటి సలగ, శ్రీ శ్రీనివాస కల్యాణం, శివశంకర్, కవిరత్న కాళిదాస, గురు బ్రహ్మ వంటి సినిమాల్లో నటించారు. మహదేవప్ప అంత్యక్రియలు ఈ రోజు (సోమవారం) నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment