
హీరోయిన్ రాధిక త్వరలో పెళ్లిపీటలెక్కబోతోంది. దాదాపు ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. తన నిశ్చితార్థం ఉంగరాన్ని హైలైట్ చేసేలా ఓ ఫోటోను గత నెలలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో కాబోయే భర్త ముఖాన్ని రివీల్ చేయలేదు. తాజాగా తను జీవితం పంచుకోబోతున్న వరుడెవరో బయటపెట్టింది. 'నిన్ను కలవడం విధి.. నీతో ప్రేమలో పడటం ఒక మ్యాజిక్.. నీతో కలిసి జీవితం పంచుకోవడానికి కౌంట్‌డౌన్ ప్రారంభించాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. కార్తీక పెళ్లాడబోయే వ్యక్తి పేరు రోహిత్ మీనన్.
అతడి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కార్తీక.. జోష్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో పలు సినిమాలు చేసిన ఆమె రంగం సినిమాతో క్రేజ్ సొంతం చేసుకుంది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో దమ్ములో నటించింది. అల్లరి నరేశ్‌తో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలో నటించిన ఆమె 2015 నుంచి వెండితెరకు దూరంగా ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment