
ప్రస్తుతం కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లో సడలింపులు ఇస్తున్నాయి. దీంతో పలు షూటింగులు తిరిగి పున: ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ సీజన్ 2 విన్నర్, నటుడు కౌశల్ మండా తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
సెకండ్ వేవ్ లాక్‌డౌన్ అనంతరం తొలిసారి షూటింగ్‌లో పాల్గొన్న కౌశల్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ‘2 నెలల తర్వాత ఫస్ట్ డే షూటింగ్.. పోమ్మా కరోనా ఇకచాలు’ ఫన్నీ క్యాప్షన్‌తో ఫొటో షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా మీద సెటైరికల్‌గా స్పందించిన కౌశల్ పోస్టుపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. కాగా కౌశల్ ప్రస్తుతం ఆది సాయి కుమార్ సినిమాలో బ్లాక్ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో ఓ పవర్ పోలీస్ ఆఫీసర్‌గా కౌశల్ కనిపించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment