ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘లవ్ టుడే’. ఇందులో ఇవాన హీరోయిన్. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను అదే టైటిల్‌తో తెలుగులో నిర్మాత ‘దిల్’ రాజు ఈ నెల 25న విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘2019లో దర్శకుడిగా నాకు ‘కోమలి’ సినిమా చేసే చాన్స్ వచ్చింది.
‘జయం’ రవిగారు హీరోగా నటించిన ఈ సినిమాకు మంచి స్పందన లభింంది. ఆ తర్వాత మూడేళ్లు స్క్రిప్ట్ వర్క్ చేసి ‘లవ్ టుడే’ తీశాం. నేను 2007లో ‘అప్(ప్పా) చేసిన షార్ట్ ఫిల్మ్‌నే ‘లవ్ టుడే’ సినిమాగా తీశాం. మొబైల్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు కాబట్టి ఈ చిత్రం హిట్ అవుతుందని ఊహించాను. అయితే తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు.
‘లవ్ టుడే’ ప్రిమియర్ ఇంట్రవెల్ సమయంలో ‘దిల్’ రాజుగారు ఈ సినిమా సపర్‌హిట్ అన్నారు. అదే జరిగింది. నన్ను అందర ధనుష్‌తో పోల్చుతున్నారంటే నేను సన్నగా ఉండటం వల్ల కాబోలు. ఆయనతో పోల్చడం హ్యాపీగా ఉన్నప్పటికీ అంత అద్భుతమైన నటుడితో నాకు పోలిక పెట్టడం సరైంది కాదనిపిస్తోంది’’ అన్నారు. ‘‘లవ్ టుడే’కి మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు ఇవాన.
Comments
Please login to add a commentAdd a comment