
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ‘మా’ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోతున్నారని కమిటీ సభ్యులను నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు, మా భవనం కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వదా అని ఆయన ప్రశ్నించారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న మనమంతా.. బహిరంగంగా చర్చించుకోవడం సరికాదన్నారు. అసోసియేషన్ ఎన్నికల్లో అర్టిస్టులు అందరూ సమానమేనన్నారు.
గతంలో ఫండ్ రైజింగ్ పేరుతో మా సభ్యులు అమెరికా వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఫస్ట్ క్లాస్, టాప్ క్లాస్‌లో ఫ్లైట్‌లో అమెరికా వెళ్లిన చేసిన కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ‘మా’బిల్డింగ్ నిర్మాణం కోసం మంచు విష్ణు ముందుకొస్తే, తాను సహకరిస్తానని చెప్పారు. సినీ పెద్దలంతా కలిసి వస్తే.. ఇంద్రభవనం నిర్మించుకోవచ్చని బాలయ్య అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment