Sai Dharam Tej Road Accident: Madhapur DCP Shocking Comments Goes Viral - Sakshi
Sakshi News home page

Sai Dharam Tej: రేసింగ్‌ అనేది అబద్దం.. అసలు కారణాలు ఇవే

Published Sat, Sep 11 2021 4:12 PM | Last Updated on Sat, Sep 11 2021 5:31 PM

Madhapur DCP Comments On Sai Dharam Tej Accident - Sakshi

మెగా హీరో సాయి తేజ్‌ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్‌ నటుడు కుమారుడు నవీన్‌, సాయితేజ్‌ రేసింగ్‌ పెట్టుకొని డ్రైవింగ్‌ వెళ్లారనే వార్తలు వినిపించాయి. ఈ వార్తలను మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు కొట్టిపారేశారు. తాము దుర్గం చెరువు బ్రిడ్జి మీద ఉన్న సీసీ టీవీ పుటేజీని పరిశీలించామని, దాంట్లో సాయి తేజ్‌ సింగిల్‌గానే వెళ్తున్నాడని, రేసింగ్ అన్నట్లు ఎక్కడ కనిపించలేదన్నారు.
(చదవండి: దాని వల్లే తేజ్‌కు ప్రాణాపాయం తప్పింది)

అతను బైక్‌ కంటే ముందుగా ఒక ఆటో వెళ్తుందని, దాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. అయితే ఆ ఆటోని కుడివైపు నుంచి కాకుండా ఎడమవైపు నుంచి ఓవర్‌టేక్‌ చేశాడని, రోడ్డుమీద ఇసుక ఉండడంతో బైక్‌ స్కిడ్‌ అయి సాయితేజ్‌ కిందపడిపోయారని చెప్పారు. కాగా, సాయితేజ్‌ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నేడు కూడా ఐసీయూలోనే సాయి తేజ్‌కు చికిత్స అందిస్తామని వైద్యులు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement