Superstar Mahesh Babu Sarkaru Vaari Paata Title Song Released - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata: మహేశ్‌ ఫ్యాన్స్‌కు ట్రీట్‌, టైటిల్‌ సాంగ్‌ వచ్చేసింది

Published Sat, Apr 23 2022 11:23 AM | Last Updated on Sat, Apr 23 2022 1:20 PM

Mahesh Babu Sarkaru Vaari Paata Title Song Release - Sakshi

Sarkaru Vaari Paata Title Song Release: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో 'మహానటి' కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిన్న(శుక్రవారం, ఏప్రిల్‌ 22న) గుమ్మడికాయ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇక సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను స్టార్ట్‌ చేసిన చిత్ర బృందం తాజాగా ఈ మూవీ టైటిల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేసి మహేశ్‌ ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చింది.

చదవండి: అందులో తప్పేముంది, అది నా ఇష్టం: ట్రోల్స్‌పై మలైకా ఫైర్‌ 

‘సరా సరా సర్కారు వారి పాట... షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా...’ అంటూ సాగే ఈ పాట బాగా ఆకట్టుకుంటుంది. తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ఈ రోజు(ఏప్రిల్‌ 23) ఉదయం 11 గంటలకు విడుదలై అప్పుడే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన కళావతి, పెన్నీ సాంగ్స్ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సముద్రఖని, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి: గుడ్‌న్యూస్‌, ‘సర్కారు వారి పాట’కు గుమ్మడికాయ కొట్టేశారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement