మాళవిక మోహనన్ చేసింది రెండు సినిమాలే.. అయినా ప్రేక్షకులకు ఆమె అంటే క్రేజ్ ఓ రేంజ్‌లో. ఆమెకూ ఓ క్రేజ్.. ఇదిగో ఈ ఫ్యాషన్ బ్రాండ్స్ పట్ల...
కరిష్మా జూల్రీ
కరిష్మా మెహ్రా.. పిట్ట కొంచెం కూత ఘనం లాంటి అమ్మాయి. ఇరవై ఏళ్ల వయసుకే సొంతంగా బంగారు ఆభరణాల దుకాణం ప్రారంభించడమే కాదు.. అనతి కాలంలోనే ఆ దుకాణాన్ని ప్రముఖ జ్యూయెలరీ బ్రాండ్‌గా తీర్చిదిద్దింది. ఆ బ్రాండ్ పేరే ‘కరిష్మా జూల్రీ’. ఇక్కడ హాల్‌మార్క్ వెండి, బంగారు ఆభరణాలు లభిస్తాయి. ఈ మధ్యనే తను డిజైన్ చేసిన ట్రావెల్, వెడ్డింగ్ కలెక్షన్స్‌కు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇక బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామందికి ఈ జూల్రీ జ్యూయెలరీ ఒక ఫేవరెట్ బ్రాండ్. బంగారం ధర, వజ్రాల నాణ్యతతో సంబంధం ఉండదు. కేవలం డిజైన్ ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు.
కరణ్ తోరానీ
న్యూఢిల్లీకి చెందిన కరణ్ తోరానీ.. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో అమ్మమ్మ దగ్గరే గడిపేవాడు. చుట్టూ చేనేత కళతో ఆ ప్రాంతం ఎప్పుడూ అందమైన వస్త్ర ప్రపంచంలా కరణ్‌కు కనిపించేది. ఆ ప్రేరణ తో బాల్యంలోనే పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కన్నాడు. ఆ లక్ష్యంతోనే న్యూఢిల్లీలో ‘తోరానీస్’ పేరుతో ఒక బొటిక్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే తోరానీ డిజైన్స్ పాపులరై మంచి గుర్తింపు పొందాయి. చాలామంది సెలబ్రిటీస్ కరణ్‌తో ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయించుకుంటారు. ఈ దుస్తుల ధర డిజైన్‌ను బట్టే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి.
డ్రెస్ డిజైనర్ : కరణ్ తోరానీ
ధర: రూ. 1,62,000
జ్యూయెలరీ బ్రాండ్: కరిష్మా జూల్రీ
ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
దుస్తులపై పెద్దగా దృష్టి పెట్టను. కానీ, అందరమ్మాయిల్లాగే నాకూ జ్యూయెలరీ అంటే ఇష్టం. ముఖ్యంగా బోల్డ్ ఇయరింగ్స్ నా ఫేవరెట్.
– మాళవిక మోహనన్
Comments
Please login to add a commentAdd a comment