మలయాళ ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని బహిర్గతం చేసింది హేమ కమిటీ. బలం, పలుకుబడి ఉన్నవారు ఇక్కడి ఆర్టిస్టులను బానిసల కన్నా హీనంగా చూస్తారని, మహిళా ఆర్టిస్టులను వేధింపులకు గురిచేస్తున్నారని ఓ నివేదికను బయటపెట్టింది. ఈ క్రమంలో పలువురు నటీనటులు తమకు ఎదురైన చేదు అనుభవాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నారు.
వేధింపులు
మాలీవుడ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దర్శకుడు రంజిత్, నటుడు సిద్ధిఖి.. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్టు (అమ్మ)లోని తమ పదవులకు రాజీనామా చేశారు. ఇంతలో ఓ మలయాళ నటి ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఇబ్బందులను సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. 2013లో ఓ సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు ముఖేశ్, మణ్యంపిల్లరాజు, ఇడవెల బాబు, జయసూర్య నన్ను శారీరకంగా వేధించారు, దూషించారు. నేను సర్దుకుపోయి పని చేసుకుందామని ప్రయత్నించాను.
ఇండస్ట్రీ వదిలేశా..
కానీ ఆ వేధింపులు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో నేను మలయాళ ఇండస్ట్రీని వదిలేయక తప్పలేదు. అక్కడినుంచి చెన్నైకి మకాం మార్చేశాను. వీళ్ల వల్ల నేను పడ్డ వేదనకు, దాని పర్యవసానాలకు నాకిప్పుడు న్యాయం కావాలి. నా పట్ల దారుణంగా ప్రవర్తించిన ఆ నలుగురిపై చర్యలు తీసుకోవాలి. వారు అడిగినదానికి ఒప్పుకోలేదని నాతో దురుసుగా ప్రవర్తించారు అని రాసుకొచ్చింది.
బలవంతంగా..
'క్యాలెండర్ సినిమా షూటింగ్‌లో మణ్యం పిల్ల రాజుకు భార్యగా నటించాను. ఒకసారి కారులో వెళ్తున్నప్పుడు ఆయన నన్ను వ్యక్తిగత ప్రశ్నలు అడిగాడు. నా భర్త చనిపోయాడని చెప్పినందుకు ఒక్కదానివి సంతోషంగా ఎలా ఉంటున్నావని ఇబ్బందికరంగా మాట్లాడాడు. జయసూర్య అయితే డె ఇంగోట్ నొక్కి(2108) సినిమా టైంలో నన్ను బలవంతంగా వెనకనుంచి హత్తుకుని ముద్దుపెట్టాడు. మరో నటుడైతే రాత్రికి వస్తానంటూ నీచంగా మాట్లాడాడు. ఇంకొకరు హోటల్ గదిలో నాపై అత్యాచారం చేయబోయాడు' అని మిను పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment