Manchu Vishnu Shares A Good News About MAA Association Building - Sakshi
Sakshi News home page

MAA Elections 2021: త్వరలోనే ఆ కల నెరవేరబోతుంది: మంచు విష్ణు

Published Sat, Aug 21 2021 1:01 PM | Last Updated on Sat, Aug 21 2021 2:42 PM

Manchu Vishnu Exciting News About MAA Association Building - Sakshi

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు యంగ్‌ హీరో మంచు విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘మా’కు ఓ ప్రత్యేక భవనం నిర్మించి ఇస్తామని హామీ కూడా ఇచ్చాడు మంచు విష్ణు. అవసరమైతే తన జేబులోంచి డబ్బులు పెట్టి భవంతిని కట్టేందుకు సిద్ధమని ప్రకటించారు.
(చదవండి: తుపాకితో బుల్లెట్ల వర్షం కురిపించిన పవన్‌ కల్యాణ్‌.. వీడియో వైరల్‌)

ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ…‘మా’బిల్డింగ్‌  కోసం మూడు చోట్ల స్థలాలను చూసినట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు ఈ యంగ్‌ హీరో.  'మా' భవనం మన అందరి కల. త్వరలోనే ఆ కల నెరవేరబోతుంది. నేను స్వయంగా వెళ్లి మూడు స్థలాలను చూడడం జరిగింది. వాటిలో ఏది బెస్ట్‌ అనేది అందరం కూర్చొని నిర్ణయిద్దాం’అంటూ ఓ వీడియోని ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement