మన్యం ధీరుడు సినిమాలోని "నమోస్తుతే నమోస్తుతే భారత మాతా" అనే దేశభక్తి గీతం ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. ఈ సినిమా కథానాయకుడైన ఆర్‌వీవీ సత్యనారాయణ స్వయంగా స్వరకల్పన చేసి పాడడమే కాకుండా హిమాలయాల్లో చిత్రీకరించారు. అందుకే ఈ పాట ప్రత్యేకతను సంతరించుకుంది.
ఇటీవల ఈ సాంగ్‌ను థాయిలాండ్,మలేషియా, బ్యాంకాక్, మయన్మార్ లాంటి దేశాల్లోని ప్రవాస భారతీయులు ప్రశంసిస్తున్నారు. త్వరలోనే అమెరికాలో జరిగే తానా సభల్లో ఈ పాట పాడనున్నారు. ఆ తర్వాత జర్మనీలో కూడా ఈ సాంగ్ పాడబోతున్నట్లు విశాఖకు చెందిన శేఖర్ ముమ్మోజీ బృందం తెలిపారు. కాగా.. ఈ పాటకు తుంబలి శివాజీ సాహిత్యాన్నందించారు. మన దేశ ఔన్యత్యాన్ని చాటి చెప్పే ఈ అద్భుతమైన పాటకు మరింత ఆదరణ దక్కాలని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment