
మాస్ మహారాజ్ రవితేజ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్’.. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న సంక్రాతి కానుకగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమాలో రవితేజ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుండగా.. నాలుగేళ్ళ తర్వాత శ్రుతీ హాసన్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సినిమాను గత ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాల్సింది. కానీ లాక్ డౌన్ వల్ల విడుదల వాయిదా పడింది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. తక్కువ సమయంలోనే కోటి వ్యూస్ అందుకుంది. క్రాక్ సినిమాతో రవితేజ కచ్చితంగా మళ్లీ ఫామ్లోకి వచ్చేలా కనిపిస్తున్నాడు. తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా సోమవారం క్రాక్ సినిమాలో ‘మాస్ బిర్యానీ’ లిరికల్ పాటను విడుదల చేశారు. ‘ఓసి నా క్లాస్ కల్యాణి...పెట్టవే మాస్ బిర్యాని అంటూ’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. రాహుల్ నంబియార్, సాహితి చాగంటి పాడారు. చదవండి: ఆ పాట ప్రతి బిర్యానీ సెంటర్‌లో ఉంటుంది
ఈ పాట రవితేజ అభిమానులను, మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బ్లాక్ బస్టర్ సినిమాతో మాస్ మహారాజ్ మళ్లీ రంగంలోకి వచ్చారని, ఇక థియేటర్లలో రచ్చ రచ్చేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా క్రాక్ రూపొందుతోంది. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమా పాటలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే ‘క్రాక్’ సినిమాలోని పాటలు కూడా అంత హిట్ అవుతాయనే నమ్మకం వెయ్యి శాతం ఉందని సంగీత దర్శకుడు తమన్ అన్నారు. ‘క్రాక్’ సినిమా నుంచి నేడు విడుదల అయిన ‘క్రాక్ బిర్యానీ..’ అనే పాట ప్రతి బిర్యానీ సెంటర్‌లో వినిపిస్తుంటుందని పేర్కొన్నారు. చదవండి: సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. ఇక రచ్చ రచ్చే
Comments
Please login to add a commentAdd a comment