Meera Jasmine Reentry: Meera Jasmine Gets A Offer In Boyapati And Ram Pothineni Movie - Sakshi
Sakshi News home page

Meera Jasmine: బోయపాటి సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతోన్న హీరోయిన్‌!

Published Thu, Feb 17 2022 10:09 AM | Last Updated on Thu, Feb 17 2022 11:04 AM

Meera Jasmine Gets A Offer In Boyapati And Ram Pothineni Movie - Sakshi

Meera Jasmine Reentry: ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు తెరపై మెరిసింది నటి మీరా జాస్మిన్‌. ఆ తర్వాత వరస చిత్రాల్లో ఆపర్‌ అందుకున్న ఆమెకు పెద్దగా సక్సెస్‌ రాలేదు. చివరిగా గొరింటాకు సినిమాలోరాజశేఖర్‌ చెల్లెలి పాత్రలో మెప్పించింది, మంచి హిట్‌ను అందుకుంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గడంతో  పెళ్లి చేసుకుని సెటిలైపోయింది.

చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ తర్వాత నటకు బ్రేక్‌ ఇచ్చిన మీరా జాస్మిన్‌ ఇటీవల ఓ తమిళ చిత్రంలో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ క్రమంలో ఆమెకు తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి తన సినిమాలో మీరాకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్‌ హీరో రామ్‌ పోతినేని బోయపాటి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చర్చలు, స్క్రిప్ట్‌ను పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్‌.. ప్రస్తుతం నటీనటులు ఎంపిక దశలో ఉంది.

చదవండి: ఆయనకు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా: డైరెక్టర్‌

ఈ క్రమంలో హీరో అక్క పాత్రకు మీరా జాస్మిన్‌ను సంప్రదించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే ఆమెకి బోయపాటి కధ,పాత్రను వివరించగా చేసేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో అమెది కీలకమైన పాత్ర అని సమాచారం. కాగా బోయపాటి తెరకెక్కించిన మొదటి సినిమా భద్రలో మీరా జాస్మిన్ హీరోయిన్‌‌గా నటించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement