
ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నభా నటేష్. ఆ సినిమాలో నభా నటనకు, అందానికి టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ ఇస్మార్ట్ బ్యూటీకి అప్పట్లో వరుస ఆఫర్లు వచ్చాయి. సాయితేజ్, నితిన్‌లాంటి యంగ్ స్టార్స్ సరసన నటించిన మెప్పించిన నభా..ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. గతేడాదిలో ఏ చిత్రంలోనూ కనిపించలేదు.
వరుస చిత్రాలు చేస్తున్న సమయంలో తను ఇలా బ్రేక్ తీసుకోవడానికి కారణం ఏంటో తాజాగా ఆమె బయటపెట్టింది. ఓ ప్రమాదంలో తనకు తీవ్రంగా గాయాలు కావడంతో ఆమె సినిమాలకు దూరం అయ్యిందట. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ‘గడిచిన సంవత్సరం చాలా కష్టంగా సాగిపోయింది, నాకొక ప్రమాదం జరిగింది, అప్పుడే నా ఎడమ భుజానికి తీవ్ర గాయమై క్లిష్టమైన సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది’అని నభా చెప్పుకొచ్చింది. చికిత్సలో భాగంగా తను తీవ్రమైన శారీరక, మానసిక బాధని ఎదురుకున్నట్టు చెబుతూ తను మళ్ళీ నటించడం మొదలుపెడతానని, తిరిగి చిత్రాలు చేస్తానని చెప్పుకొచ్చింది ఈ ఇస్మార్ట్ బ్యూటీ. అలా తీవ్ర గాయాల పాలై తిరిగి కోలుకోవడమే కాక మళ్ళీ తనకి వచ్చిన, నచ్చిన పనిని మొదలుపెట్టాలనుకోవడం మామూలు విషయం కాదు.
Comments
Please login to add a commentAdd a comment