Naga Chaitanya Becomes Mahesh Babu Fans President In “Thankyou” Movie? - Sakshi
Sakshi News home page

మహేశ్‌ ఫ్యాన్స్‌ అధ్యక్షుడిగా నాగ చైతన్య

Published Wed, Jan 6 2021 3:50 PM | Last Updated on Wed, Jan 6 2021 8:48 PM

Naga Chaitanya May Play Mahesh Babu Fans President In Thank You Movie - Sakshi

యంగ్‌ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘లవ్‌స్టోరీ’షూటింగ్‌ పూర్తి చేసుకున్న చైతూ.. ప్రస్తుతం  విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తూన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం అబిడ్స్‌లోని రామకృష్ణ సినిమా హాల్‌లో జరుగుతుండగా.. చైతుపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.
(చదవండి : బంపరాఫర్‌ కొట్టేసిన అఖిల్‌.. పెద్ద సినిమాలో చాన్స్‌!)

ఈ సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా కనిపించబోతున్నాడని సమాచారం. అలాగే ఈ సినిమాలో మహేశ్‌ కొన్ని నిమిషాలపాటు తళుక్కున మెరవబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. తాజాగా లీకైన ఫోటోలను బట్టి చూస్తే ఇది నిజమనే తెలుస్తోంది. అభిరామ్ పేరు పేరిట, మహేష్ బాబు పోస్టర్లతో థియేటర్ ప్రాంగణంలో బ్యానర్లు ఏర్పాటు చేసిన పోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మరోవైపు మహేశ్‌కి అక్కినేని ఫ్యామిలీతో మంచి బాండింగ్‌ ఉంది. అఖిల్ తొలి సినిమా అఖిల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మహేశ్ బాబు హాజరయ్యాడు. తాజాగా నాగచైతన్య సినిమాలోనూ కనిపించి.. మరోసారి అక్కినేని ఫ్యామిలీతో బాండింగ్‌ను మహేశ్ బాబు మరోసారి గుర్తు చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

అలాగే ఈ సినిమాలో చైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు. గతంలో మజిలీ సినిమాలో క్రికెటర్‌గా కనిపించి మెప్పించాడు. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, అవికా గోర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. థాంక్యూ సినిమాని 2021 చివర్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement