సమంతకు నో చెప్పిన నాగచైతన్య! | Naga Chaitanya Reject Samantha As A Heroine In Thank You Movie | Sakshi
Sakshi News home page

సమంతకు నో చెప్పిన నాగచైతన్య!

Published Wed, Jan 6 2021 6:46 PM | Last Updated on Wed, Jan 6 2021 7:14 PM

Naga Chaitanya Reject Samantha As A Heroine In Thank You Movie - Sakshi

వెండితెరపై సమంత, నాగచైతన్య జోడికి ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరు కలిసి నటించిన ‘మజిలీ’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో మరోసారి వీరిద్దరిని వెండితెరపై జంటగా చూపించాలని ఓ దర్శకుడు అనుకున్నాడట. పైగా స‌మంత త‌న మూవీలో ఉంటే సినిమా హిట్ అన్న‌ది ఆ ద‌ర్శ‌కుడికి సెంటిమెంట్. కానీ చైతూ మాత్రం స‌మంతను వ‌ద్ద‌న్న‌ట్లు తెలుస్తోంది.
(చదవండి: మహేశ్‌ ఫ్యాన్స్‌ అధ్యక్షుడిగా నాగ చైతన్య)

నాగ చైత‌న్య హీరోగా… మ‌నం సినిమా ఫేం విక్ర‌మ్ కుమార్ థాంక్యూ అనే మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా రానున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం అబిడ్స్‌లోని రామకృష్ణ సినిమా హాల్‌లో జరుగుతుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఒక హీరోయిన్‌గా సమంతని తీసుకుందామని దర్శకుడు సూచించగా, చైతన్య సున్నితంగా తిరస్కరించాడట. ఈ మధ్యనే తామిద్దరం కలిసి ఓ సినిమా చేశామని, మళ్లీ ఇప్పుడే కలిసి నటిస్తే ప్రేక్షకులు కూడా బోర్‌గా ఫీల్‌ అవుతారని చెప్పాడట. సమంత కాకుండా వేరే హీరోయిన్‌ని చూడమని దర్శకుడికి చెప్పేశాడట. దీంతో చిత్ర యూనిట్‌ కొత్త హీరోయిన్‌ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక థాంక్యూ సినిమాలో చైతన్య మహేశ్‌బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా కనిపించబోతున్నాడని సమాచారం. అలాగే ఈ సినిమాలో చైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2021 చివర్లో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement