Nagarjuna Akkineni Buys Kia EV6 Car - Sakshi
Sakshi News home page

Nagarjuna Akkineni: ఎలక్ట్రిక్‌ కారు కొన్న టాలీవుడ్‌ మన్మథుడు.. ఎన్ని లక్షలో తెలిస్తే..

Published Thu, Jun 29 2023 3:51 PM | Last Updated on Thu, Jun 29 2023 4:23 PM

Nagarjuna Akkineni Buys Kia EV6 Car - Sakshi

మన్మధుడు అన్న పదానికి అక్కినేని నాగార్జున బ్రాండ్‌ అంబాసిడర్‌! 63 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా ఉంటూ యంగ్‌ హీరోలకే సవాలు విసురుతున్నాడీ టాలీవుడ్‌ స్టార్‌. నాగచైతన్య, అఖిల్‌ పక్కన నాగ్‌ తండ్రిలా కాకుండా వారికి బ్రదర్‌లా కనిపిస్తాడు. అంతటి ఫిట్‌నెస్‌ మెయింటెన్‌ చేస్తున్న నాగార్జున దగ్గర కార్ల కలెక్షన్‌ కూడా బాగానే ఉంది. తాజాగా అతడు ఓ ఎలక్ట్రిక్‌ కారు కొన్నాడు. కియా ఈవీ 6 కారు కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

కియా కారా? మజాకా?
కియా ఈవీ 6 కారు ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇందులో వైర్‌లెస్‌ చార్జర్‌, స్మార్ట్‌ కీ, స్టార్ట్‌/స్టాప్‌ చేయడానికి ఓ బటన్‌ ఉంది. డ్రైవర్‌ సీటును 10 రకాలుగా అడ్జస్ట్‌ చేసుకునే వీలుంది. 77.4 కిలో వాట్స్‌ చార్జ్‌ చేస్తే 528 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. అంతేకాదు, 100 కి.మీ దూరం వెళ్లడానికి కేవలం నాలుగన్నర నిమిషాలు మాత్రమే చార్జింగ్‌ పెడితే సరిపోయేలా అల్ట్రా ఫాస్ట్‌ చార్జర్‌ను ఇచ్చారు. ఈ కారు ధర విషయానికి వస్తే ఇది రూ.60-70 లక్షల మేర ఉంటుంది.

జాడ లేని కొత్త సినిమా
నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. గతేడాది అక్టోబరులో ది ఘోస్ట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్‌ ఇంతవరకు కొత్త సినిమా ప్రకటించలేదు. దర్శకుడు మోహన్‌రాజా, రచయిత బెజవాడ ప్రసన్నకుమార్‌ వంటివారు నాగార్జునకు కథలు వినిపించారు, కానీ.. ఏదీ ఫైనలైజ్‌ కాలేదని సమాచారం. ఇటీవలే ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ అజయ్‌ భూపతి ఓ కథను వినిపించగా అది నాగ్‌కు నచ్చిందని, త్వరలో వీరి కాంబోలో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే!

చదవండి: స్పై ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement