
ఒడియా హీరో బాబుషాన్ భార్య తృప్తి.. హీరోయిన్ ప్రకృతి మిశ్రాపై దాడి చేసిన విషయం తెలిసిందే! దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రకృతితో కలిసి కారులో వెళ్తున్న బాబుషాన్‌ను అడ్డగించి వాళ్లిద్దరినీ ఓ ఆటాడుకుంది తృప్తి. తన భర్తతో ఎఫైర్ నడుపుతుందన్న అనుమానంతో ఆమెను వెంబడించి మరీ దాడి చేసింది. ఈ ఘటన అభిమానులను, నెటిజన్లను షాక్‌కు గురి చేసింది.
దీనిపై ప్రకృతి మాట్లాడుతూ.. 'ఇక్కడ ఏమైపోతుందంటే కనీసం మేము చెప్పేది కూడా వినకుండా అమ్మాయిలదే తప్పు అని నిందిస్తున్నారు. దురదృష్టవశాత్తూ మనం అలాంటి సమాజంలో బతుకుతున్నాం. సహ నటుడు బాబుషాన్‌తో ఓ కార్యక్రమానికి వెళ్లి వచ్చాను. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న అతడి భార్య కొంతమందిని వెంటేసుకుని వచ్చి నాపై దాడి చేసింది. మానసికంగానూ హింసించింది. ఇది అస్సలు కరెక్ట్ కాదు. నేను మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నాను, కానీ రియాలిటీలో నేను వేధింపులకు గురవుతున్నాను. ఏదేమైనా మహిళా సాధికారతను సాధించడమే నా ముందున్న లక్ష్యం' అని చెప్పుకొచ్చింది.
దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'ఒకరి భర్తను, చిన్నారి తండ్రిని లాక్కోవడమే మహిళా సాధికారతా? ఓహ్.. ఈ జనరేషన్ నేర్చుకుంటుంది ఇదేనా.. అయితే నువ్వు చాలా గ్రేట్' అని కామెంట్ చేసింది. దీనికి ప్రకృతి.. 'కాస్త బుర్ర పెట్టి ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇంత తొందరగా ఒకరిని తప్పుగా అంచనా వేస్తున్నావంటే నువ్వు చాలా గొప్పదానివి' అని రిప్లై ఇచ్చింది. కాగా ప్రకృతి 'హలో అర్షి' సినిమాకుగానూ జాతీయ చలనచిత్ర అవార్డు అందుకుంది.
చదవండి: హీరోతో హీరోయిన్ ఎఫైర్? అడ్డంగా దొరకడంతో నటుడి భార్య దాడి
హీరోలను సర్ అంటారు, కానీ మమ్మల్నెందుకో..
Comments
Please login to add a commentAdd a comment