
నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ నవదీప్ ఎక్కడికెళ్లినా ఓ ప్రశ్న అతడిని నీడలా వెంటాడుతోందట. సోసల్ మీడియాలో అయితే ఇక చెప్పనవసరం లేదు. మీ పెళ్లెప్పుడు అని అని ఆయనను అడుగుతూనే ఉన్నారట. తాజాగా ఓ నెటిజన్ మరోసారి ఇదే విషయాన్ని ఆరా తీశాడు. దీంతో చిర్రెత్తిన నవదీప్.. 'ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎందుకు ప్రతిఒక్కరూ నా పెళ్లి మీదే పడుతున్నారు? దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి' అని వేడుకున్నాడు. అయితే నెటిజన్లు ఈ ప్రశ్న ఊరికే అడగడం లేదు. అసలే పెద్ద పెద్ద హీరోలు బ్యాచ్‌లర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ పెళ్లి బాజాలు మోగిస్తున్నారు. (చదవండి: ప్రభాస్ మూవీపై కామెంట్.. సారీ చెప్పిన సైఫ్ అలీఖాన్)
దీంతో నవదీప్ కూడా వారి బాటలోనే వెళ్తాడేమో అన్న సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు అడిగినట్లు కనిపిస్తోంది. పైగా నెట్టింట్లో ఆయన యాంకర్ విష్ణుప్రియతో డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకునేందుకు కూడా సదరు నెటిజన్ రాయేసినట్టున్నాడు. కానీ నవదీప్ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో విష్ణుప్రియ తన స్నేహితురాలు మాత్రమే అని కుండ బద్ధలు కొట్టాడు. దీన్ని పెద్ద రచ్చ చేయకండని సూచించాడు. ఇదిలా వుంటే నవదీప్ ప్రస్తుతం మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న 'మోసగాళ్లు' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. (చదవండి: ఉన్నది ఒక్కటే జీవితం.. ఆస్వాదించాలి)
Comments
Please login to add a commentAdd a comment