యాంకర్ విష్ణుప్రియ పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై ఓ టీవీ షోతో ఫేమ్ తెచ్చుకుంది. మొదట జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ ఆ తర్వాత బుల్లితెరపై సత్తా చాటింది. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ. 2016లో వచ్చిన 'ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్' మూవీతో పాటు 2020లో 'చెక్ మేట్'అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.
ప్రస్తుతం ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ విష్ణుప్రియ అదరగొడుతోంది. ఇటీవల గంగులు అనే వీడియో సాంగ్‌లో మానస్‌తో కలిసి తన డ్యాన్స్‌తో కుర్రకారును ఊర్రూలూగించింది. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. గతంలో కూడా వీరిద్దరూ జరీ జరీ పంచెకట్టి అనే సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: బాలీవుడ్‌లో ఆ రెండు సినిమాల్లో నుంచి నన్ను తీసేశారు: భూమిక)
తొలి నాళ్లలో చాలా పద్ధతిగా కనిపించిన విష్ణుప్రియ ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచింది. అయితే పైకి మాత్రం కాస్త బోల్డ్‌గా కనిపించే ప్రియ చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చింది. తాజాగా మై విలేజ్ షో వారితో కలిసి దావత్ చేసుకున్న విష్ణు ప్రియ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆమె జీవితంలో పడిన కష్టాలను వివరించింది.
విష్ణుప్రియ 'తన అమ్మనాన్నలదీ చీరాల.. బాపట్ల. తాను పుట్టిందీ చెన్నై.మా అమ్మ హెయిర్ డ్రెస్సర్. శ్రియ, ఆర్తి అగర్వాల్‌కు హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేసింది. మా అమ్మ టాలెంట్ ఉన్నా ఇలా ఎందుకు ఉండేదనిపించింది. ఆమె కోసమే కష్టపడి ఇక్కడ వరకు వచ్చా. 2015లో ఈ ఇండస్ట్రీలోకి వచ్చా. పోవే పోరా అనే షోతోనే బ్రేక్ వచ్చింది. పోవే పోరా, నంబర్ వన్ యారీ ఓకేసారి ఆఫర్స్ వచ్చాయి. అప్పట్లో సరిగా తిండి కూడా లేదని.. ఇప్పుడు కాస్తా డబ్బులు సంపాదించుకుని ఆన్‌లైన్ ఆర్డర్స్ పెట్టుకుని తింటున్నా.' అంటూ తాను పడ్డ కష్టాలను వివరించింది.
(ఇది చదవండి: తొలి సినిమా రిలీజ్‌కు ముందే సూపర్‌స్టార్‌తో పెళ్లి.. పిల్లలు పుట్టాక..)
Comments
Please login to add a commentAdd a comment