చిన్న సినిమాగా విడుదలైన ‘జాతి రత్నాలు’ భారీ కలెక్షన్లతో పాటు రికార్డులను కూడా క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. అందులో కొన్ని పెద్ద సినిమాలకు సైతం సాధ్యం కానీ రేర్ ఫీట్‌లను కూడా సునాయాసంగా సాధిస్తోంది. కోవిడ్ అనంతరం ఓవర్‌సీస్ లో వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటడంతో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా మరో రికార్డును సృష్టించింది.
చిన్న సినిమా పెద్ద రికార్డులు
‘క్రాక్, ఉప్పెన’ లాంటి సినిమాలు హిట్ టాక్‌తో టాలీవుడ్‌లో భారీ కలెక్షన్లను రాబట్టాయి, కానీ ఓవర్‌సీస్‌లో మాత్రం ఎందుకో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ ‘జాతిరత్నాలు’ చిత్రం మాత్రం ఆ పరిస్థితిని మార్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైతే వసూళ్లను రాబడుతోందో ఓవర్‌సీస్‌లోనూ అదే స్థాయిలో దూసుకుపోతోంది. గురువారం నాటికి ఈ సినిమా మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్నట్లు నవీన్ పొలిశెట్టి తన ఇన్‌స్టా లో పోస్ట్ చేశాడు. మొత్తం 1,001,825 డాలర్ల కలెక్షన్లతో చిన్న సినిమాల జాబితాలో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం యూఎస్‌లో ‘జాతిరత్నాలు’ తన వసూళ్ల వేటను ఇంకా కొనసాగిస్తోంది.
గతంలో టాలీవుడ్‌లో తెలుగు రాష్ట్రాల మార్కెట్ తో పాటు యూఎస్ మార్కెట్ మీద కూడ అంతే శ్రద్ద ఉండేది. అక్కడ చిన్న సినిమా మిలియన్ డాలర్ వసూలు చేసింది అంటే హిట్ అనే ప్రామాణికం ఉండేది. కానీ లాక్డౌన్ మూలంగా ఓవర్‌సీస్ లో కలెక్షన్లు అనే మాట వినడమే కరువైంది, అక్కడి మన సినిమాల మార్కెట్ క్రాష్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు పూర్తిగా తెరుచుకుని వరుసగా సినిమాలు విడదలై వసూళ్లను రాబడుతున్న యూఎస్‌లో మాత్రం తెలుగు సినిమాల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఆ పరిస్థితిని ఇప్పుడు జాతిరత్నాలు మార్చేసిందని చెప్పాలి. ( చదవండి: బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన జాతిరత్నాలు! )
Comments
Please login to add a commentAdd a comment