
పాల ద్వారా చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే న్యూడ్, తన హై-గ్లేజర్ లైన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ శ్రీలీలను నియమించుకుంది. ఆమెకు ఉన్న పాపులారిటీతో దక్షిణ భారత మార్కెట్‌లో బ్రాండ్ అమ్మకాలను పెంచుకోవచ్చని ఆశిస్తోంది. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ.. "'నా చర్మ సంరక్షణ కోసం పాలను ఉపయోగిస్తూనే పెరిగాను. వీటితో న్యూడ్ ఆవిష్కరణలు తీసుకురావడం సంతోషంగా ఉంది. నేటి చర్మ సంరక్షణ అవసరాలకు సరిగ్గా సరిపోయేలా న్యూడ్ అధిక-పనితీరు గల ఉత్పత్తులను తయారు చేయడం బాగుంది" అని అన్నారు.

పెరుగు, కోజిక్ యాసిడ్‌తో కూడిన ఫేస్‌టైమ్ ఇన్‌స్టంట్ గ్లో మాస్క్, సన్‌స్టాపబుల్ ఎస్పీఎఫ్ 45.. 3-ఇన్-1 సన్‌స్క్రీన్, స్లీప్ ఆన్ ఇట్ ఓవర్‌నైట్ గోట్ మిల్క్ సికా మాస్క్ లాక్టిక్ యాసిడ్, బకుచియోల్ స్కిన్‌హెరిటెన్స్ బాడీ సీరమ్ శ్రీలీలకు ఇష్టమైన న్యూడ్ ఉత్పత్తులు.
సౌత్‌బే టాలెంట్ సీఈఓ ప్రశాంత్ పొట్లూరి మాట్లాడుతూ.. "న్యూడ్ స్కిన్ ప్రొడక్టుల ప్రచారం కోసం సౌత్‌బే టాలెంట్‌తో శ్రీలీల చేతులు కలపడం మాకు చాలా ఆనందంగా ఉంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా ఇందులో వ్యూహాత్మక పెట్టుబడి పెట్టారు. వీరిద్దరి కాంబినేషన్ న్యూడ్ ప్రయాణంలో ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుంది" అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment