‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె.హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ ముగిసింది.
మలి షెడ్యూల్ షూటింగ్ గోవాలో ప్రారంభం కానుందని తెలిసింది. దేశంలో పట్టించు కోకుండా ఉన్న తీరప్రాంత ప్రజల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్(తండ్రీకొడుకుల పాత్రల్లో) కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment