Khiladi Movie Updates: Anasuya Bharadwaj Plays Key Role In Ravi Teja Khiladi Movie - Sakshi
Sakshi News home page

ఖిలాడిలో అనసూయ పాత్ర ఇదే..

Published Wed, Feb 3 2021 1:42 PM | Last Updated on Wed, Feb 3 2021 3:33 PM

Official Announcement Anchor Anasuya Plays Key Role In Ravi Teja Khiladi - Sakshi

బుల్లితెర‌పైన టాప్‌ యాంక‌ర్‌గా కొన‌సాగుతూనే.. వెండితెర‌పై వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్నారు అన‌సూయ‌. హీరోయిన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, ఐటెం సాంగ్‌ అనే తేడా లేకుండా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ సినిమాల్లో రాణిస్తున్నారు అన‌సూయ. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో గుర్తుండిపోయే పాత్ర‌ల్లో న‌టించిన ఈ యాంక‌ర్‌కి ఇప్పుడు మ‌రో బంప‌రాఫ‌ర్ వ‌చ్చింది. ఈ ఏడాది ‘క్రాక్’ విజ‌యంంతో మంచి ఊపు మీదున్న మాస్ రాజా ర‌వి తేజ న‌టిస్తోన్న ‘ఖిలాడి’లో చిత్రంలో అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఖిలాడి టీమ్‌లోకి అన‌సూయ‌కు స్వాగ‌తం చెబుతున్న‌ట్లు ఒక పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. అంతేకాదు ఈ మూవీకి గేమ్ ఛేంజ‌ర్ అన‌సూయ అని ద‌ర్శ‌కుడు కామెంట్ పెట్టారు. చూస్తుంటే అన‌సూయ ఈ మూవీలో ప్రధానమైన పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
(చదవండి: 3 నిమిషాల పాట కోసం అనసూయకు రూ .20 లక్షలు!)

కాగా థ్రిల్ల‌ర్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఖిలాడికి రమేశ్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మ‌రోవైపు అన‌సూయ థ్యాంక్యు బ్ర‌ద‌ర్ అనే చిత్రంలో న‌టించింది. ఇప్ప‌టికే షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రోవైపు కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తోన్న రంగ మార్తండ‌లోనూ అన‌సూయ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఇందులో అన‌సూయ దేవ‌దాసి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం
(చదవండి: దూసుకొస్తున్న ఖిలాడి.. రిలీజ్‌ డేట్ ఫిక్స్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement